క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా టీకా.. త్వరలోనే అధికారికంగా వెల్లడి
- క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్‌కు కూడా టీకా
- అందరిలానే వారికీ ఇస్తామన్న ప్రభుత్వ వర్గాలు
- ‘ఆపరేషన్ కరేజియన్’ పేరిట పంపిణీకి ఏర్పాట్లు
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) త్వరలోనే ఫైజర్ కరోనా టీకాను తీసుకోనున్నారు. టీకా తీసుకున్న వెంటనే ఆ విషయాన్ని క్వీన్ ఎలిజబెత్ అధికారికంగా ప్రకటిస్తారని బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. టీకా తీసుకునేందుకు వారు అంగీకరించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టీకా తీసుకున్న విషయాన్ని క్వీన్ ఎలిజబెత్ కనుక బయటకు వెల్లడిస్తే టీకాపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే, టీకా ఇచ్చే విషయంలో రాజకుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏమీ ఉండదని అధికారులు తెలిపారు. వయసుల వారీగా ప్రజలకు టీకా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, రాజకుటుంబానికి కూడా అదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా, మంగళవారం నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. ‘ఆపరేషన్ కరేజియన్’ పేరిట వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది.