నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు

  • వాయుగుండంగా మారిన అల్పపీడనం
  • తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు
  • నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆ ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై పడింది. ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడతాయని పేర్కొంది.

నేడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, రామనాథపురానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద అల్పపీడనం స్థిరంగా ఉంది. బురేవి తుపాను కారణంగా తమిళనాడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.


More Telugu News