బిల్లులపై తొందరపాటు నిర్ణయాలుకూడదు: వ్యవసాయ చట్టాలపై చంద్రబాబు

  • పాలకుల నిర్ణయాలు రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలి
  • రైతులు, రైతు సంఘాల ఏకాభిప్రాయం సాధించాలి
  • కొత్త చట్టాలు రైతులకు శాపంగా మారకూడదు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. బిల్లుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలని అన్నారు. పాలకుల నిర్ణయాలు ఎప్పుడూ రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ చట్టాల విషయంలో రైతులు, రైతు సంఘాల ఏకాభిప్రాయం సాధించాలని కోరారు.

అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మేలైన విధానాలను తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు నూతన వ్యవసాయ చట్టాలు మరింత భారంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News