ఇంకా తొలగని బురేవి ఎఫెక్ట్... ఏపీకి వర్ష సూచన

  • బలహీనపడి అల్పపీడనంగా మారిన తుపాను
  • తమిళనాడులో విస్తారంగా వర్షాలు
  • దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనూ వానలు
  • రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన
బురేవి తుపాను బలహీనపడి అల్పపీడనంగా ఇంకా బంగాళాఖాతంలో కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడులోని అనేక ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.

ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు తెలిపింది. కాగా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తమిళనాడు తీరం దాటి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని, ఆపై క్రమంగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.


More Telugu News