రోడ్డు పక్కన కల్వర్టే వేదికగా యువకులతో ముచ్చటించిన పవన్... ఫొటోలు ఇవిగో!
- నెల్లూరు జిల్లాలో పవన్ పర్యటన
- యువతతో ఆత్మీయ సమావేశం
- ఓటును అమ్ముకోవద్దని వ్యాఖ్యలు
- ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతారని వెల్లడి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటగిరి వెళుతూ బాలాయపల్లి-గొల్లపల్లి మధ్య ఉన్న ఓ కల్వర్టు వద్ద ఆగారు. తన కాన్వాయ్ వెంట వస్తున్న యువకులు, స్థానికులతో అక్కడికక్కడ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని, అవినీతిని ప్రశ్నించాలనుకుంటే మాత్రం ఓటును అమ్ముకోకూడదని స్పష్టం చేశారు. ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోయినట్టేనని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగాలు వృథా పోనివ్వరాదని స్పష్టం చేశారు. ఇక, యువతతో కల్వర్టు వద్ద కూర్చుని పవన్ ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.