అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి తన భుజాలను తానే తట్టుకుని 'శభాష్' అనుకున్నారు: లోకేశ్
- ప్రకాశం జిల్లాలో లోకేశ్ పర్యటన
- తుపాను బాధిత రైతులను పరామర్శించిన లోకేశ్
- వైసీపీ ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి రాలేకపోతున్నారని వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రకాశం జిల్లా కారంచేడులో వరద బాధిత రైతులను పరామర్శించారు. నివర్ తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోకి రాలేని పరిస్థితి ఉందని అన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పెంచుకుంటూ పోతానని జగన్ హామీలు ఇచ్చారని, ఇసుక, సిమెంటు, కూరగాయల ధరలు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.
అటు ట్విట్టర్ లోనూ రైతు సమస్యలపై స్పందించారు. రాష్ట్రంలో రైతులకు సమస్యలు లేవు, రైతులంతా సంతోషంగా ఉన్నారు అని అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి తన భుజం తానే తట్టుకుని శభాష్ అనుకున్నారని తెలిపారు. వాస్తవానికి వరుస తుపానులతో, వరదలతో నష్టపోయి సహాయం అందక బతకలేని పరిస్థితిలో ఉన్నామని, కనీసం రైతు భరోసా కూడా అందడంలేదని రైతులు చెబుతున్నారని లోకేశ్ వెల్లడించారు.