మేము అధికారంలోకి రాకుండా కేసీఆర్ కానీ, ఒవైసీ కానీ అడ్డుకోలేరు: కిషన్ రెడ్డి
- హైదరాబాద్ ప్రజలు బీజేపీని ఆశీర్వదించారు
- 2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం
- ఇద్దరూ కలసి బిర్యానీ తింటారు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు బీజేపీ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఏఎన్ఐతో మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని చెప్పారు. 48 సీట్లను కట్టబెట్టారని అన్నారు. ప్రజల్లో ఎంఐఎం అధినేత ఒవైసీ పట్ల వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
తాము అధికారంలోకి రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఒవైసీ కానీ అడ్డుకోలేరని అన్నారు. హైదరాబాద్ మినీ తెలంగాణ అని... ఇక్కడి ఫలితాలు రాష్ట్రమంతా వస్తాయని చెప్పారు. కేసీఆర్, ఒవైసీ ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారని కిషన్ రెడ్డి అన్నారు. ఇద్దరూ కలిసి కేసీఆర్ నివాసంలో బిర్యానీ తింటారని ఎద్దేవా చేశారు.