జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవని టీడీపీ జాతీయ పార్టీనా?: కొడాలి నాని
- అభ్యర్థులందరూ డిపాజిట్ కోల్పోయారన్న కొడాలి నాని
- చంద్రబాబు అసమర్థత అంటూ వ్యాఖ్యలు
- చంద్రబాబు గాలి నాయకుడు అంటూ విమర్శలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చవిచూడడంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. గ్రేటర్ ఎన్నికల్లో 106 డివిజన్లలో పోటీచేసిన టీడీపీ కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయిందని, అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. ఇలాంటి ఫలితాలు వచ్చిన పార్టీని జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
ఈ ఫలితాలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. చంద్రబాబు టీడీపీని ఒక గాలి పార్టీగా తయారుచేశారని, తాను సైతం ఒక గాలి నాయకుడిగా మారిపోయారని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలపలేకపోవడం చంద్రబాబు అసమర్థత అని వ్యాఖ్యానించారు.