కరోనా వ్యాక్సిన్ ట్రయల్ డోస్ వేయించుకున్న హర్యానా మంత్రికి కరోనా పాజిటివ్

  • వ్యాక్సిన్ వేయించుకున్న రెండు వారాలకు పాజిటివ్
  • అంబాలాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి
  • రెండు డోసులు వేసుకుంటేనే ఫలితమన్న కేంద్ర ఆరోగ్య శాఖ
హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ (67) కరోనా వైరస్ ట్రయల్ డోస్ వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయకు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఈ ఉదయం ఆయన ట్వీట్ చేశారు. అంబాలాలోని సివిల్ ఆసుపత్రిలో ఆయన చేరారు. భారత్ బయోటెక్ తయారుచేసిన 'కోవాక్సిన్' కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తర్వాత ఆయనకు కరోనా సోకింది. తనకు కరోనా సోకడంతో అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. హర్యానా ఆరోగ్య మంత్రిగా కూడా ఈయనే వ్యవహరిస్తున్నారు.

ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందిస్తూ, వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాతే మనిషి శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతాయని తెలిపింది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్ అని వెల్లడించింది. అనిల్ విజ్ కేవలం ఒక డోస్ మాత్రమే తీసుకున్నారని చెప్పింది.


More Telugu News