ఎంఐఎంతో పాత్తు లేకుండానే మేయర్ పీఠం దక్కించుకుంటాం: మంత్రి ఎర్రబెల్లి
- టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తుపై ఊహాగానాలు
- కొట్టి పారేసిన ఎర్రబెల్లి
- విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ, ఎంఐఎం లబ్ధిపొందాయని వ్యాఖ్య
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్ మేయర్ పీఠానికి పది సీట్ల దూరంలో నిలిచింది. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.
వరంగల్ నగర పాలక సంస్థ ట్రాక్టర్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... ఎంఐఎంతో పొత్తు లేకుండానే గ్రేటర్ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ, ఎంఐఎం లబ్ధిపొందాయని ఆయన తెలిపారు.