గతంలో వచ్చిన నష్టానికి ఇప్పటికీ పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు: నారా లోకేశ్

  • ఈరోజు నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను
  • గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రులో పంటల నష్టం
  • పూర్తిగా నష్టపోయామని రైతులు చెప్పారు
నివర్ తుపాను ధాటికి ఏపీలోని అనేక ప్రాంతాల్లో రైతులు భారీగా పంటలను నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ నేత నారా లోకేశ్ పంటలను పరిశీలించారు. ఈ విషయాలను తెలుపుతూ ట్వీట్లు చేశారు.

‘ఈరోజు నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో  పర్యటించాను. గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామంలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించాను. వరుస తుపాన్లు, వరదలు కారణంగా పూర్తిగా నష్టపోయామని, చెప్పారు’ అని తెలిపారు.

‘గతంలో వచ్చిన నష్టానికి కూడా ఇప్పటి వరకూ పరిహారం అందలేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ -క్రాప్ లో ఎంటర్ కాలేదు కాబట్టి మీకు ప్రభుత్వ సహాయం రాదు అనడం దారుణం. పంట నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం అందించాలి’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.


More Telugu News