కొన్ని సీట్లు పోయినా ఏం కాదు... బీజేపీని కొట్టాలంటే కేసీఆర్ ఉండాల్సిందే: అసదుద్దీన్ ఒవైసీ
- గ్రేటర్ ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్
- కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచే తెలుసు
- దక్షిణాదిన గొప్ప భవిష్యత్ ఉన్న నేత కేసీఆర్
- మేయర్ పదవిపై శనివారమే చర్చిస్తామన్న అసదుద్దీన్
మత రాజకీయాలను పులుముతున్న బీజేపీని ఎదుర్కోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే సమర్థవంతుడైన నేతని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కొన్ని స్థానాల్లో ఓటమి పాలైనంత మాత్రాన రాజకీయంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కేసీఆర్ ను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి చూస్తూనే ఉన్నానని, దక్షిణాదిన ఆయన గొప్ప భవిష్యత్ ఉన్న నేతని కొనియాడారు.
బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు పర్యటించిన డివిజన్లలో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేసిన ఒవైసీ, పాతబస్తీలో లక్షిత దాడులు చేస్తామన్న బీజేపీని ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడించామని అన్నారు. తాము చాలా తక్కువ సీట్లలోనే పోటీ చేశామని, అయినా తమ సీట్లను నిలుపుకున్నామని అన్నారు. తదుపరి రాజకీయ నిర్ణయాలపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని, మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో టీఆర్ఎస్ అధినేతలతో మాట్లాడుతానని అన్నారు.