అంతరిక్షంలో పండిన ముల్లంగి... తొలిసారిగా ఫొటోలు పోస్ట్ చేసిన నాసా!

  • గొప్ప విజయమని వ్యాఖ్య
  • 20 మొక్కలను పెంచి పంటను కోసిన వ్యోమగాములు
  • భూమిపైకి తెప్పించనున్న శాస్త్రవేత్తలు
వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ముల్లంగి పంటను పండించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా పోస్ట్ చేసింది. చంద్రుడిపైనా, అంగారకుడిపైనా నివాస ఏర్పాట్లకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ, ఇది ఓ గొప్ప విజయమని నాసా పేర్కొంది.

నాసా ఫ్లయిట్ ఇంజనీర్ కేట్ రూబిన్స్ మొత్తం 20 మొక్కలను పెంచి, పంటను కోశారని, వీటిని వచ్చే సంవత్సరం ప్రారంభంలో భూమిపైకి తీసుకుని వచ్చేంత వరకూ కోల్డ్ స్టోరేజ్ లో ఉంచుతారని నాసా ప్రకటించింది. కాగా, జీరో గ్రావిటీలో పండిన పంటల్లో తాజాగా ముల్లంగి కూడా చేరడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News