70 ఏళ్ల చరిత్రలో కశ్మీర్ లో తొలిసారి ఓటు వేసిన పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన శరణార్థులు
  • తమ కల సాకారమైందంటూ ఆనందం 
  • భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్య
పాకిస్థాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన శరణార్థుల కల ఎట్టకేలకు నెరవేరింది. పాక్ నుంచి వచ్చిన శరణార్థులు మన దేశంలో తొలిసారి ఓటు వేశారు. జమ్మూకశ్మీర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత వారు డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాక్ నుంచి వచ్చిన శరణార్థులు ఇంతకు ముందెప్పుడూ ఓటు వేయలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో వారు ఓటు వేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా శరణార్థులు మాట్లాడుతూ తమ కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.


More Telugu News