గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా... 2023లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం: ఎంపీ అరవింద్
- ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అరవింద్
- తండ్రీకొడుకుల అహంకారాన్ని దించాలనుకుంటున్నారని వ్యాఖ్యలు
- 2024లో 15 ఎంపీ స్థానాలతో మోదీకి కానుక ఇస్తామని వెల్లడి
గ్రేటర్ తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ యువ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని అన్నారు. 2024లో తెలంగాణలో 15 ఎంపీ స్థానాలు గెలిచి నరేంద్ర మోదీకి కానుకగా ఇస్తామని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ పార్టీతో విసిగిపోయామని ప్రజలు భావిస్తున్నారని, అందుకు మార్పు దిశగా ఆలోచిస్తున్నారని అరవింద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లిందని, తండ్రీకొడుకుల అహంభావాన్ని దించాలని ప్రజలు నిశ్చయించుకున్నారని అన్నారు. ఇంతవరకు సచివాలయానికే పోని వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మోసం చేయనిది ఎవర్ని? అంటూ నిలదీశారు. ప్రజలు మోదీ నాయకత్వంలోని అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారని అరవింద్ పేర్కొన్నారు.