భారత్‌కు కొవిడ్ టీకా అందించేందుకు సిద్ధం: ఫైజర్

  • జర్మనీకి చెందిన బయాన్‌టెక్‌తో కలిసి టీకా అభివృద్ధి
  • యూకేలో వినియోగానికి తాత్కాలిక అనుమతి
  • భారత ప్రభుత్వంతో త్వరలో చర్చలు
భారతదేశానికి కరోనా టీకా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా ఫార్మారంగ దిగ్గజ సంస్థ ఫైజర్ తెలిపింది. జర్మనీకి చెందిన బయాన్‌టెక్‌తో కలిసి కొవిడ్ టీకాను ఫైజర్ అభివృద్ధి చేసింది. ఈ టీకా వినియోగానికి యూకేలో ఇప్పటికే తాత్కాలిక అనుమతి లభించింది. దీంతో వచ్చే వారం నుంచే అక్కడి ప్రజలకు ఈ టీకా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టీకాను సరఫరా చేయాలని భావిస్తున్న ఫైజర్.. పలు దేశాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే భారత ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని, ఆ దేశానికి కూడా టీకాను అందించాలనుకుంటున్నామని ఫైజర్ చైర్మన్ అల్బర్టా బౌర్లా పేర్కొన్నారు.


More Telugu News