జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ ఇవిగో!
- అత్యధిక సీట్లను గెలవనున్న టీఆర్ఎస్
- గ్రేటర్ లో భారీగా పుంజుకోనున్న బీజేపీ
- ఓట్ షేర్ తక్కువ ఉన్నా ఎక్కువ సీట్లను కైవసం చేసుకోనున్న ఎంఐఎం
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేయడంతో ప్రచార పర్వం యుద్ధ రంగాన్ని తలపించింది. ఈ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్, ఆరా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. టీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లను గెలుచుకోబోతున్నట్టు ఆ సంస్థలు వెల్లడించాయి.
పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు:
గత ఎన్నికల కంటే బీజేపీ భారీగా పుంజుకుందని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుందని అభిప్రాయపడింది.
ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్:
పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు:
- టీఆర్ఎస్: 68 నుంచి 78 డివిజన్లలో జయకేతనం ఎగురవేస్తుంది. 38 శాతం ఓట్ షేర్ ను కైవసం చేసుకుంటుంది.
- ఎంఐఎం: 38 నుంచి 42 వరకు సీట్లను కైవసం చేసుకుంటుంది. 13 శాతం ఓట్ షేర్ సాధించనుంది.
- బీజేపీ: 25 నుంచి 35 డివిజన్లలో గెలుస్తుంది. ఓట్ షేర్ మాత్రం 32 శాతం వరకు వచ్చే అవకాశం ఉంది.
- కాంగ్రెస్: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒకటి నుంచి 5 సీట్ల వరకు గెలుచుకుంటుంది. 12 శాతం వరకు ఓట్ షేర్ వస్తుంది.
- ఇతరులు 5 శాతం వరకు ఓట్ షేర్ సాధించే అవకాశం ఉంది.
గత ఎన్నికల కంటే బీజేపీ భారీగా పుంజుకుందని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుందని అభిప్రాయపడింది.
ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్:
- టీఆర్ఎస్: 78 (అటూ ఇటుగా 7 స్థానాలు) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 40.08 శాతం.
- ఎంఐఎం: 41 (అటూ ఇటుగా 5 స్థానాలు) వస్తాయి. ఓట్ షేర్ 13.43 శాతం.
- బీజేపీ: 28 ( అటూ ఇటుగా 5 సీట్లు) స్థానాలు గెలుచుకుంటుంది. ఓట్ షేర్ 31.21 శాతం.
- కాంగ్రెస్: 3 (అటూ ఇటుగా 3 సీట్లు) స్థానాలను గెలుచుకుంటుంది. ఓట్ షేర్ 8.58 శాతం.