స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 15 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 20 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా లాభపడ్డ మారుతి సుజుకి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీ, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో లాభాలు హరించుకుపోయాయి. చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 44,633కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,134 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (7.45%), ఓఎన్జీసీ (4.54%), ఏసియన్ పెయింట్స్ (4.08%), ఎన్టీపీసీ (4.01%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.51%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.13%), టీసీఎస్ (-1.48%), బజాజ్ ఆటో (-1.31%), ఇన్ఫోసిస్ (-1.27%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.06%).


More Telugu News