చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత: కొడాలి నాని తీవ్ర విమర్శలు
- చంద్రబాబు ఒక్క రూపాయి పెన్షన్ కూడా పెంచలేదు
- బాబుకు పారిపోవడం అలవాటు
- తెలుగుదేశం ఒక ఫేక్ పార్టీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఈరోజు సభలో చర్చ జరుగుతున్న సమయంలో... ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు. రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి... అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో మీరు ఎంత పెన్షన్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క రూపాయి పెన్షన్ కూడా పెంచలేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన కచ్చితంగా పెన్షన్ ఇస్తోందని చెప్పారు.
చంద్రబాబు తన జీవితంలో ఎన్నోసార్లు పారిపోయారని... 1983లో ఓడిపోగానే కాంగ్రెస్ ను వదలి పారిపోయారని, అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారని కొడాలి నాని విమర్శించారు. ఓటుకు నోటు కేసు రాగానే హైదరాబాద్ వదిలి పారిపోయారని, కరోనా రాగానే కాల్వగట్టు వదిలి హైదరాబాదుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత అని, టీడీపీ ఫేక్ పార్టీ అని అన్నారు. వేరే పార్టీతో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయలేరని దెప్పిపొడిచారు.