ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారకముందే చర్యలు తీసుకోండి: నిర్మలా సీతారామన్ కు సురేశ్ ప్రభు లేఖ

  • పరిధిని దాటి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది
  • అప్పులను సంక్షేమ పథకాలకు వాడుతున్నారు
  • ఇలాగైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది
ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని పేర్కొంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేశ్ ప్రభు లేఖ రాశారు. దేశంలోని పలు రాష్ట్రాలు అప్పులు చేయడం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులు లిమిట్స్ దాటి పోయాయని చెప్పారు. ఈ అప్పులను సంక్షేమ పథకాలకు తరలిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పథకాలకు వాడాల్సిన నిధులను సంక్షేమ పథకాలకు తరలిస్తే... అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని వివరించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటి దిగజారక ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. సురేశ్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.


More Telugu News