పవన్ కల్యాణ్ ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్

  • మరాఠి సినిమాల్లో బిజీగా ఉన్న రేణు దేశాయ్
  • పిల్లలతో పవన్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రేణు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
రేణు దేశాయ్... తెలుగు సినీ ప్రేక్షకులకు అందరికీ సుపరిచితమైన వ్యక్తి రేణుదేశాయ్. తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న రేణు... జనసేనాని పవన్ కల్యాణ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన నుంచి దూరమైన తర్వాత మరాఠి సినిమాల్లో ఆమె తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. పిల్లలిద్దరినీ తన వద్దనే ఉంచుకుని ఒక తల్లిగా ఆమె వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తనకు వీలు ఉన్నప్పుడల్లా పూణెకు వెళ్లి తన పిల్లలతో సమయాన్ని గడుపుతుంటారు.

తాజాగా రేణు ఒక అద్భుతమైన ఫొటోను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ తన కుమారుడు, కుమార్తెను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె కామెంట్ పెట్టారు. కొన్ని అరుదైన ఫొటోలను తాను ఫోన్ కెమెరాతో తీశానని చెప్పారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలపై నెటిజెన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


More Telugu News