‘జనగణమన’లో అనవసర పదాలు తొలగించండి: ప్రధానికి సుబ్రహ్మణ్యస్వామి లేఖ
- ‘జనగణమన’లోని సింధు ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది
- అనవసర పదాలు తొలగిస్తామని అప్పట్లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు
- 1943 నాటి గీతాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్
జాతీయ గీతం 'జనగణమన'లోని కొన్ని పదాలు మార్చాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఇందులోని అనవసర పదాలను తొలగించాలని కోరారు. జాతీయగీతంలోని అనవసర పదాలను తొలగించి, అవసరమైన పదాలతో జాతీయ గీతాన్ని పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారని ఈ సందర్భంగా స్వామి గుర్తు చేశారు.
జనగణమన గీతాన్ని ఎవరిని ప్రశంసిస్తూ రాశారోనన్న అనుమానాలు ఉన్నాయన్నారు. 21 అక్టోబరు 1943న ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే ఆలపించిన గీతాన్నే అమలు చేయాలని నిన్న ప్రధానికి రాసిన లేఖలో స్వామి డిమాండ్ చేశారు. ఆ గీతంలో పేర్కొన్న సింధ్ ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్ భూభాగంలో ఉందని, ఇప్పుడా పదాన్ని తొలగించి ‘ఈశాన్యం’ అనే పదాన్ని జోడించాలని 2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.