ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు: నారా లోకేశ్
- వైకాపా ఇసుకాసురులు ప్రజల్ని దోచుకుంటున్నారు
- జగన్ పాలనలో ట్రాక్టర్ ఇసుక 6 వేల రూపాయలు
- లారీ ఇసుక 30 వేల రూపాయలు
- భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే
ఇసుక ధరలను భారీగా పెంచేసి ఏపీ ప్రభుత్వ నేతలు ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా పార్టీ నేతలు ఈ రోజు నిరసన తెలిపారు. ‘వైకాపా ఇసుకాసురులు ప్రజల్ని దోచుకుంటున్నారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయిలు, 5 యూనిట్ల లారీ ఇసుక గరిష్ఠంగా 5 వేల రూపాయలు ఉంటే వైఎస్ జగన్ పాలనలో ట్రాక్టర్ ఇసుక 6 వేల రూపాయలు, లారీ ఇసుక 30 వేల రూపాయలు చేసి ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు’ అని లోకేశ్ విమర్శించారు.
‘భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే. ఇసుక అక్రమ రవాణా ఆపాలి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అంటూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాం’ అని లోకేశ్ పేర్కొన్నారు. తాము నిరసన తెలుపుతుండగా తీసుకున్న ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.