ఫ్లాష్ బ్యాక్ కోసం డైట్ ఫాలో అవుతున్న పవన్!

  • 'వకీల్ సాబ్' కోసం కోర్టు సీన్లు చేసిన పవన్ 
  • ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే బ్యాలెన్స్  
  • లిక్విడ్ డైట్ తీసుకుంటున్న పవర్ స్టార్ 
  • ఈ నెల మూడో వారం నుంచి తిరిగి షూటింగ్   
మన ఆర్టిస్టులు ఆయా పాత్రల కోసం ఎలా కావాలంటే అలా తమ బాడీని మలుచుకుంటూ వుంటారు. ఒక్కోసారి లావుగా కనపడడానికి వెయిట్ పెంచుతారు.. ఒక్కోసారి సన్నబడడానికి వెయిట్ తగ్గుతారు. ఇందుకోసం బాగా కష్టపడతారు కూడా. ఇదే కోవలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు షూటింగ్ కోసం సన్నబడడానికి ప్రయత్నిస్తున్నారు.

కొంత కాలం గ్యాప్ తర్వాత పవన్ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. హిందీలో హిట్టయిన 'పింక్' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ఇటీవలే పవన్ పాల్గొనగా కోర్టు సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఇక ఆయన షూటింగ్ పార్టుకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే మిగిలి ఉందట.

ఈ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో ఆయన సన్నగా కనపడాలట. అందుకోసం ప్రస్తుతం పవన్ ప్రత్యేకమైన లిక్విడ్ డైట్ ను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఎక్కువగా ద్రవ పదార్థాలతో కూడిన ఆహారాన్నే ఆయన తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ నెల మూడో వారం నుంచి ఈ ఫ్లాష్ బ్యాక్ దృశ్యాల చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. శ్రుతి హాసన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేద థామస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


More Telugu News