మోకాళ్ల పైవరకూ చీర కట్టుకుని ఉండాలని ఆ పాత్రను ఒప్పుకోలేదు: రాశి
- రంగమ్మత్త కేరెక్టర్ తొలుత నాకే వచ్చింది
- ఆ లుక్ నాకు సరిపోదని ఒప్పుకోలేదు
- 'నిజం' సినిమాలో నెగెటివ్ కేరెక్టర్ చేయడం తప్పు
తెలుగు సినీ పరిశ్రమలో రాశి తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. బాలనటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రాశి... ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగారు. పదరహారణాల తెలుగుదనం ఉట్టిపడే రాశి చాలా ఏళ్ల పాటు అగ్రనటిగా కొనసాగారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో చిన్న క్యారెక్టర్లు కూడా చేశారు. అనంతరం పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'రంగస్థలం'లో రంగమ్మత్త కేరెక్టర్ చాలా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాత్రను పోషించిన యాంకర్ అనసూయకు మంచి పేరు వచ్చింది. అయితే తొలుత రంగమ్మత్త కేరెక్టర్ రాశి వద్దకు వచ్చిందట. కానీ ఆమె ఒప్పుకోలేదట. దీని గురించి ఆమె మాట్లాడుతూ, రంగమ్మత్త కేరెక్టర్ చాలా మంచిదని... అయిదే, మోకాళ్ల పైవరకు చీర కట్టుకుని ఉండాలని... ఆ లుక్ తనకు సరిపోదని తాను ఒప్పుకోలేదని చెప్పారు. మహేశ్ బాబు 'నిజం' సినిమాలో గోపీచంద్ పక్కన నెగెటివ్ పాత్ర చేయడం కూడా తప్పేనని అన్నారు.
'నిజం' సినిమాలో గోపీచంద్, నీవు లవర్స్ అని దర్శకుడు తేజ తొలుత తనకు చెప్పారని... అయితే షూటింగ్ తొలి రోజే ఆ పాత్ర ఎలాంటిదో తనకు అర్థమైందని... దీంతో సినిమా నుంచి తప్పుకుందామని అనుకున్నానని రాశి చెప్పారు. ఇదే విషయాన్ని తమ పీఆర్వో బాబూరావుకు చెప్పగా... సడన్ గా ఇలా చేస్తే ఇండస్ట్రీలో బ్యాడ్ అవుతామని అన్నారని, దీంతో, సినిమాలో కంటిన్యూ అయ్యానని అన్నారు.