ఆన్‌లైన్ గేమింగ్స్‌ను రద్దు చేస్తున్నాం: మేకతోటి సుచరిత
- నేరాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం
- ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ బెట్టింగులు పెరిగాయి
- శిక్షాకాలం, జరిమానా పెంచాము
ఏపీలో ఆన్ లైన్ గేమింగ్స్ ను నిషేధిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగులను నివారించేందుకు, నేరాలను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. యువత తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు చట్టంలో మార్పులు చేయాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు. గతంలో ఆన్ లైన్ బెట్టింగ్ ఉండేది కాదని... కొన్నేళ్లుగా ఇది చాలా పెరిగిందని చెప్పారు. బెట్టింగుల కోసం దొంగతనాలకు పాల్పడటం, తల్లిదండ్రులను కూడా బెదిరించడం వంటివి జరుగుతున్నాయని అన్నారు. లాక్ డౌన్ సమయంలో బెట్టింగులకు ఎక్కువగా అలవాటు పడ్డారని చెప్పారు.
ఇప్పటి వరకు మొదటి సారి నేరం చేస్తే నెల నుంచి ఆరు నెలల వరకు మాత్రమే శిక్ష పడేదని... ఇప్పుడు శిక్షా కాలాన్ని మూడు నెలల నుంచి ఏడాది వరకు పెంచామని సుచరిత చెప్పారు. రూ. 5వేల వరకు జరిమానా కూడా విధిస్తారని తెలిపారు. ఇకపై బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కు పాదం మోపుతామని చెప్పారు.