కొనసాగుతున్న గ్రేటర్ పోలింగ్... మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 18.22 శాతం ఓటింగ్
- జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఓటింగ్
- అత్యధికంగా గుడిమల్కాపూర్ లో 49.19 శాతం నమోదు
- అత్యల్పంగా రెయిన్ బజార్ డివిజన్ లో 0.56 శాతం పోలింగ్
సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.22 శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్ల వారీగా చూస్తే అత్యధికంగా గుడిమల్కాపూర్ లో 49.19 శాతం ఓటింగ్ జరిగింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అత్యల్పంగా రెయిన్ బజార్ డివిజన్ లో 0.56 శాతం పోలింగ్ నమోదైంది. తలాబ్ చంచలం డివిజన్ లో కేవలం 0.74 శాతం పోలింగ్ జరిగినట్టు తెలిసింది. 37 డివిజన్లలో 10 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు.
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా, మధ్యాహ్నానికి కనీసం 20 శాతం కూడా ఓటింగ్ నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నగరంలోని ఐటీ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లినట్టు తెలుస్తోంది.