ఇలాగైతే టీమిండియాకు చాలా కష్టం: గౌతం గంభీర్
- టీమిండియాను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ అర్థం చేసుకున్నాడు
- అతడిని భారత జట్టు మాత్రం అర్థం చేసుకోలేకపోయింది
- కేవలం 18 ఓవర్లలోనే అతడు శతకం పూర్తి చేశాడు
- స్మిత్ తదుపరి మ్యాచుల్లోనూ ఇలాగే ఆడే చాన్స్
టీమిండియాను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ అర్థం చేసుకున్నాడని, అయితే, అతడిని భారత జట్టు మాత్రం అర్థం చేసుకోలేకపోయిందని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నారు. తొలి మ్యాచ్‌కు ముందు ఫాంలోకి వచ్చానని స్మిత్ చెప్పిన మాటలు అక్షరాల నిజమని, కేవలం 18 ఓవర్లలోనే అతడు శతకం పూర్తి చేశాడని చెప్పారు. 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 38వ ఓవర్‌లోనే సెంచరీ చేశాడని వివరించారు.
ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని, వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ ప్రస్తుతం అత్యుత్తమ ఆటగాడైనప్పటికీ అతడిని చేరుకోడానికి స్మిత్ ఎంతో దూరంలో లేడని గంభీర్ తెలిపారు. వరుస మ్యాచ్‌ల్లో 18 ఓవర్లలోనే శతకాలు సాధించడం అంత సులువుకాదని, కోహ్లీ గణంకాలు ఎంత మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ రెండు మ్యాచ్‌ల్లో స్మిత్ ఆడిన తీరు అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించారు.
స్మిత్ తదుపరి మ్యాచుల్లోనూ ఇలాగే ఆడితే టీమిండియాకు కష్టాలు తప్పవని తెలిపారు. మూడో వన్డేలోనూ అతడు చెలరేగే అవకాశం ఉందని, ఆయనను ఔట్ చేసే విధానం కనుక్కోకపోతే టీమిండియాకు కష్టమని చెప్పారు. స్మిత్ పరుగుల దాహంతో ఉన్నాడని అన్నారు. ఇదే ఫాంతో టెస్టు సిరీస్‌లోనూ స్మిత్ చెలరేగితే భారత్‌కు కష్టమని చెప్పారు. కాగా, తొలి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే.