జగన్ రెడ్డి ఇప్పుడు మడమ తిప్పి, మాట మార్చారు: నారా లోకేశ్ విమర్శలు
- ఎన్నికల ముందు అన్ని రకాల ఇళ్లు ఉచితమన్నారు
- 18 నెలల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టివ్వని జగన్
- పేదల కోసం టీడీపీ నిర్మించిన ఇళ్లను అర్హులకు కేటాయించాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్ తన హామీని నెరవేర్చడం లేదని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లనయినా లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
‘18 నెలల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టని వైఎస్ జగన్.. ఏ స్కీమ్ కావాలని అడగడం విడ్డురంగా ఉంది. ఎన్నికల ముందు అన్ని రకాల ఇళ్లు ఉచితమన్న జగన్ రెడ్డి ఇప్పుడు మడమ తిప్పి, మాట మార్చారు’ అని చెప్పారు.
‘చంద్రబాబు నాయుడి గారి హయాంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను వైకాపా ప్రభుత్వం వెంటనే అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన తెలిపాం’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ నిరసనలో పాల్గొన్న సమయంలో తీసుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.