మరో ముప్పు ముంగిట తమిళనాడు.. రేపు తీరం దాటనున్న తుపాను

  • తుపానుగా మారనున్న అల్పపీడనం
  • దక్షిణ తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రేపు శ్రీలంక తీర ప్రాంతాన్ని దాటనున్న తుపాను
నివర్ తుపానుతో అతలాకుతలం అయిన తమిళనాడుకు మరో ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని, ఆ తర్వాత అది తుపానుగా మారి రేపు శ్రీలంక తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావంతో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ముఖ్యంగా దక్షిణ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేటి నుంచి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. నేటి రాత్రి నుంచి  బంగాళాఖాతం ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల నుంచి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.


More Telugu News