సరైన సమయంలో చర్యలు తీసుకుంటాం: చంద్రబాబుపై తీర్మానంపై స్పీకర్ తమ్మినేని స్పందన
- శాసనసభలో పోడియం వద్ద బైఠాయించిన చంద్రబాబు
- రూల్ 77 ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
- తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు స్పీకర్ ప్రకటన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఘాటుగా జరిగాయి. తొలిరోజే తీవ్ర గందరగోళం మధ్య సమావేశాలు కొనసాగాయి. సభలో గతంలో ఎన్నడూ జరగని ఘటన చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడు చంద్రబాబు పోడియం వద్ద ఫ్లోర్ పై కూర్చొని ప్రభుత్వంపై నిరసనను వ్యక్తం చేశారు. స్పీకర్ హెచ్చరించినా ఆయన కదల్లేదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సభ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ సభలో మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని పరిశీలనలోకి తీసుకుంటామన్న స్పీకర్ తమ్మినేని సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి దురదృష్టకరమైన పరిణామాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు.