ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్న ట్రంప్

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కు స్పష్టమైన మెజారిటీ
  • తాము ఓడిపోయే అవకాశమే లేదంటున్న ట్రంప్
  • న్యాయస్థానాల్లో దావాలు
ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగ్గా, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ స్పష్టమైన మెజారిటీ సాధించారు. అయితే, బైడెన్ అక్రమ ఓట్లతో ఆధిక్యం పొందారంటూ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాల్లో దావాలు వేస్తుండడం తెలిసిందే. తాజాగా చేసిన ట్వీట్ లోనూ తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోయే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజకీయ సలహాదారు డాన్ స్కావినో ట్వీట్ చేసిన ఓ వీడియోను ట్రంప్ పంచుకున్నారు. ఆ వీడియోలో ట్రంప్ సభకు భారీగా జనాలు హాజరవడం చూడొచ్చు.

దీనిపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ వీడియోలో పాతికవేల మంది ఉన్నారనుకుంటే, అమెరికా అధ్యక్ష పదవికి 77 మిలియన్ల ఓట్లు కావాలన్న సంగతి మీకు తెలియదా? అంటూ ట్రంప్ కు చురకలంటించారు. లేకపోతే ఇంతటి సింపుల్ లాజిక్ మీకు అర్థంకావడం లేదా? అని ప్రశ్నించారు.


More Telugu News