స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కు అరుదైన గౌరవం
- ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా నియామకం
- రెహమాన్ కు బాధ్యతలు అప్పగించిన బాఫ్టా
- నెట్ ఫ్లిక్స్ తో కలిసి పనిచేయనున్న రెహమాన్
భారత సినీ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) ఈ అరుదైన గౌరవాన్ని రెహమాన్ కు అందించింది. బాఫ్టా రాయబారిగా ఏఆర్ రెహమాన్ ఇకపై నెట్ ఫ్లిక్స్ తో కలిసి భారత్ లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది.
సినిమాలు, కళలు, క్రీడలు, బుల్లితెర వంటి పలు రంగాల్లోని అద్భుత నైపుణ్యం ఉన్నవారిని గుర్తించడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తన నియామకంపై ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యానించారు. బాఫ్టాతో కలిసి పనిచేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. రెహమాన్ కు గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని జయహో పాటకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. కాగా, బాఫ్టా ప్రదానం చేసే అవార్డులను కూడా ఆస్కార్ తో సరిసమానంగా భావిస్తుంటారు.