అమెరికాలో కరోనా విజృంభణ 10 రెట్లు పెరిగే అవకాశం: నిపుణుల ఆందోళన

  • పండుగల సీజన్‌లో ముప్పు
  • క్రిస్మస్‌, న్యూఇయర్ జరుపుకోనున్న అమెరికా
  • పెరగనున్న సమావేశాలు, ప్రయాణాలు
పండుగల సీజన్‌లో ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటారు. దీంతో ఆ సీజన్‌లో సాధారణంగానే కరోనా విజృంభణ మరింత  పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని సార్లు 24 గంటల్లో రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో క్రిస్మస్‌, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో అమెరికాలో జనం పెద్ద ఎత్తున బంధువులు, మిత్రులను కలిసే అవకాశం ఉంది.

దీంతో అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ దీనిపై స్పందిస్తూ ఇటీవల జరిగిన థాంక్స్ గివింగ్ డే వేడుకల తర్వాత కేసులు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అన్నారు. పండుగల సీజన్‌ నేపథ్యంలో సమావేశాలు, ప్రయాణాలు పెరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమవుతుందని తెలిపారు. తాను ఎవరినో భయపెట్టడానికి చెప్పడం లేదని, దేశ ప్రజల్ని అప్రమత్తం చేయడానికే చెబుతున్నానని అన్నారు.  

కరోనాను మొదట్లో సమర్థంగా ఎదుర్కొన్న దేశాల్లోనూ వైరస్ మరోసారి విజృంభిస్తోందని, ప్రజలు నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అంటువ్యాధుల నిపుణురాలు డెబోరా బిర్‌క్స్‌  కూడా ఈ విషయంపై మాట్లాడుతూ... రెండో వేవ్‌లో రోజుకి 25 వేల కేసులు వెలుగులోకి వచ్చినా, మరణాల రేటు కాస్త తక్కువగానే ఉందని తెలిపారు.  


More Telugu News