బోకోహరమ్ తీవ్రవాదుల ఘాతుకం.. పొలంలో పనిచేసుకుంటున్న 43 మంది కూలీల గొంతు కోసిన వైనం!

  • నైజీరియాలోని మైదుగురి నగర సమపంలో దారుణ ఘటన 
  • చేతులు కట్టేసి, గొంతులు కోసిన తీవ్రవాదులు
  • దేశం మొత్తం చింతిస్తోందన్న అధ్యక్షుడు
నైజీరియాలో బోకో హరమ్ తీవ్రవాదులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఏకంగా 43 మంది వ్యవసాయ కూలీలను ఊచకోత కోశారు. పొలంలో పనిచేసుకుంటున్న వారిని తీసుకెళ్లి చేతులు కట్టేసి, గొంతు కోసం అతి దారుణంగా హత్య చేశారు. ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగర సమపంలోని కోషోబ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. ఇది అత్యంత భయానక ఘటన అని ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎడ్వర్డ్ కల్లోన్ పేర్కొన్నారు. బోకోహరమ్ తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పారు.

ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన రైతులకు ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. హత్యకు గురైన రైతు కూలీల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యావత్ దేశం ఈ ఘటనపై చింతిస్తోందన్నారు.


More Telugu News