కారుకు నిప్పంటుకుని వ్యక్తి మృతి... రైతుల 'చలో ఢిల్లీ'లో విషాదం

  • కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు
  • చలో ఢిల్లీకి పిలుపు
  • రైతుల ట్రాక్టర్లు రిపేర్లు చేసేందుకు వెళ్లిన వ్యక్తి
  • కారులో నిద్రిస్తుండగా సజీవ దహనం
కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు 'చలో ఢిల్లీ'కి పిలుపునివ్వగా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ చేరుకున్నారు. వారు తమ ట్రాక్టర్లతో సహా రాజధానికి వచ్చారు. అయితే, ఆ రైతుల ట్రాక్టర్లకు ఏవైనా మరమ్మతులు వస్తే సరిదిద్దడానికి పంజాబ్ కు చెందిన జనక్ రాజ్ అనే మెకానిక్ కూడా స్వచ్ఛందంగా ఢిల్లీ వచ్చాడు. నిన్న కొన్ని ట్రాక్టర్లకు మరమ్మతులు చేసిన అనంతరం ఓ కారులో విశ్రమించాడు.

అయితే ఆ కారుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో 55 ఏళ్ల జనక్ రాజ్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. రైతులకు మేలు చేసేందుకు వెళ్లి తానే బలైపోయిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ విషాద ఘటనపై శిరోమణి అకాలీదళ్ చీఫ్ హర్ సిమ్రన్ కౌర్ బాదల్ స్పందించారు. రైతు ఉద్యమ చరిత్రలో జనక్ రాజ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.


More Telugu News