లిఫ్టులో చిక్కుకుపోయి ఐదేళ్ల బాలుడి మృతి
- మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావిలో ఘటన
- పిల్లలతో కలిసి కింది అంతస్తుకు వెళ్లిన బాలుడు
- లిఫ్టుకు గ్రిల్స్ మధ్య చిక్కుకుపోయిన వైనం
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావిలో ఐదేళ్ల ఓ బాలుడు లిఫ్టు గ్రిల్స్ మధ్యలో నలిగిపోయి మృతి చెందాడు. కోజీ షెల్టర్ భవనంలో పలువురు పిల్లలతో కలిసి కింది అంతస్తుకు వెళ్లేందుకు ఆ బాలుడు లిఫ్ట్ ఎక్కగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ లిఫ్టుకు గ్రిల్స్‌తోపాటు దాని వెనక డోర్ కూడా ఉందని అధికారులు తెలిపారు.
గ్రిల్స్‌తో పాటు తలుపు మూసుకుంటే ఆ లిఫ్టు కదులుతుందని వివరించారు. మహమ్మద్ హుజైఫ్ సర్ఫరాజ్ షేక్ అనే బాలుడు లిఫ్టు కింది అంతస్తుకు చేరుకోగానే ముందు ఇద్దరు పిల్లలు గ్రిల్స్, డోర్ తెరుచుకొని బయటకు వచ్చారని తెలిపారు. అయితే, చివరలో లిఫ్టులో నుంచి బయటకు వచ్చిన సర్ఫరాజ్ గ్రిల్స్ మూసివేస్తున్న క్రమంలోనే వెనక ఉన్న తలుపు మూసుకుపోయిందని తెలిపారు.
ఆ సమయంలో దాని మధ్యలోనే ఉండిపోయిన మహమ్మద్ హుజైఫ్ సర్ఫరాజ్ షేక్ కు అక్కడి నుంచి ఎలా బయటకు వెళ్లాలో తెలియలేదని చెప్పారు. ఆ సమయంలో మరొకరు లిఫ్టు బటన్ నొక్కడంతో అది కిందకు కదిలిందని వివరించారు. దీంతో గ్రిల్స్ మధ్యలోనే ఉండిపోయిన బాలుడు అందులోనే చిక్కుకుని మృతి చెందాడని, ఈ ఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డయిందని తెలిపారు.