మత మార్పిడీ చేస్తోన్న వ్యక్తిపై కేసు... పరారీలో నిందితుడు

  • బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట 
  • ఇటీవలే యూపీలో చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్
  • దేవరనియా పోలీస్ స్టేషన్‌లో తొలికేసు
బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవలే చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద దేవరనియా పోలీస్ స్టేషన్‌లో తొలికేసు నమోదైంది. మతం మారాలంటూ ఓ మహిళపై ఓ వ్యక్తి ఒత్తిడి తీసుకువస్తున్నాడు.

దీంతో తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, నిందితుడు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఇతర పౌరులను చట్ట విరుద్ధంగా మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. అమ్మాయిలను ప్రేమలో పడేసి వారిని మతం మార్చుతోన్న ఘటనలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో యూపీతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.


More Telugu News