దాదాపు రూ. 4 లక్షల కోట్లతో సైన్యానికి ఆయుధాలు... భారీ డీల్స్ కుదుర్చుకోనున్న కేంద్రం!

దాదాపు రూ. 4 లక్షల కోట్లతో సైన్యానికి ఆయుధాలు... భారీ డీల్స్ కుదుర్చుకోనున్న కేంద్రం!
  • 2030లోగా 51 బిలియన్ డాలర్లతో ఆయుధాలు
  • నేవీకి ఇచ్చిన బడ్జెట్ లో 70 శాతం ఆయుధాలను ఇండియాలోనే తయారు  
  • వెల్లడించిన రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్
సమీప భవిష్యత్తులో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు భారత ప్రభుత్వం భారీ డీల్స్ కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, 2030లోగా 51 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.92 లక్షల కోట్లు)తో ఆయుధాలు కొనుగోలు చేయనుందని తెలిపారు. గోవా షిప్ యార్డ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చ్యువల్ విధానంలో ప్రసంగించిన ఆయన, నేవీకి ఇచ్చిన బడ్జెట్ లో 70 శాతం ఆయుధాలను ఇండియాలోనే తయారు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

గడచిన ఐదు సంవత్సరాల్లో భారత నౌకాదళానికి రూ. 66 వేల కోట్ల విలువైన ఆయుధాలను సమకూర్చామని పేర్కొన్న ఆయన, నౌకాదళం కోసమే 60 ప్రత్యేక ఉపరితలం నుంచి ఉపరితలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే బేస్ లను నిర్మించామని అన్నారు. ఇవి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులో భాగంగా మజగావ్ డాక్స్ షిప్ యార్డ్స్ లిమిటెడ్, గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్స్ లిమిడెట్, కొచ్చిన్ షిప్ యార్డ్స్ లిమిటెడ్ నేతృత్వంలో నిర్మించినట్టు తెలిపారు.



More Telugu News