అభిమాన సంఘాల అధ్యక్షులందరినీ ఇంటికి రమ్మన్న రజనీకాంత్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై చర్చ?

  • త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం
  • ప్రణాళికలు రచించుకుంటున్న పార్టీలు
  • రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు రజనీ సమావేశం
త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సినీనటుడు రజనీకాంత్ ఇప్పటివరకు పార్టీ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన ఇంటి ముందుకు అభిమానులు భారీగా చేరుకుని చాలాసార్లు నినాదాలు చేశారు. పార్టీ పేరును ప్రకటించి, ఎన్నికల ప్రణాళికను వేగవంతం చేయాలని అన్నారు.

అయితే, రజనీ మాత్రం ఇన్నాళ్లూ మౌనం వహిస్తూ వచ్చారు.  ఈ నేప‌థ్యంలో రజనీకాంత్ నుంచి తాజాగా కీలక ప్రకటన వచ్చింది. త‌న అభిమాన సంఘానికి చెందిన అధ్యక్షుల‌ందరూ న‌వంబ‌ర్ 30న చెన్నైకు రావాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు. రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు వారితో సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే, ఈ సమావేశం ఎందుకు  పెడుతున్నార‌న్న విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది.


More Telugu News