వచ్చేసిన వరుస సెలవులు.. సొంతూళ్లకు క్యూ కడుతున్న నగరవాసులు

  • రేపు కార్తీక పౌర్ణమి, ఎల్లుండి బల్దియా ఎన్నికలు
  • విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు రద్దీ
  • ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందంటున్న నేతలు
నిన్నటి నుంచి మంగళవారం వరకు వరుస సెలవులు రావడంతో నగరవాసులు స్వగ్రామాల బాట పట్టారు. శని, ఆదివారాలతోపాటు సోమవారం కార్తీక పౌర్ణమి, మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరుస సెలవులు వచ్చాయి. దీంతో సెలవు రోజులను స్వగ్రామాల్లో గడిపేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో విజయవాడ, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి.

ముఖ్యంగా  విజయవాడవైపు వెళ్లే వాహనాల కారణంగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. సొంతవాహనాలతోపాటు బస్సుల్లో వెళ్లే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. వరుస సెలవుల కారణంగా పెద్ద ఎత్తున నగరం ఖాళీ అవుతుండడంతో ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News