మా రైతులకు క్షమాపణ చెప్పేంత వరకు హర్యానా సీఎంను క్షమించను: పంజాబ్ సీఎం
- పంజాబ్ రైతులకు మార్చ్‌కు అనుమతి ఇచ్చేందుకు ఖట్టర్ నిరాకరణ
- రైతులపై వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగానికి అనుమతి
- కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి లేని ఇబ్బంది ఆయనకేంటని ప్రశ్న
తమ రైతులకు క్షమాపణలు చెప్పేంత వరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మాట్లాడనని, ఆయనను క్షమించబోనని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన పంజాబ్ రైతులపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించేందుకు ఖట్టర్ అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించిన అమరీందర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఢిల్లీ ప్రభుత్వానికి కూడా రైతులతో సమస్య లేదని, అలాంటప్పుడు మధ్యలో హర్యానా జోక్యం ఎందుకని ప్రశ్నించారు. అసలు మార్చ్‌కు అనుమతి ఇవ్వకపోవడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు.
ఇంత జరిగాక ఆయనతో మాట్లాడేది లేదని అమరీందర్ స్పష్టం చేశారు. ఆయన పదిసార్లు ఫోన్ చేసినా స్పందించబోనని, చేసిన తప్పును అంగీకరించి పంజాబ్ రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పే వరకు తాను ఆయనతో మాట్లాడబోనని పేర్కొన్నారు. అంతేకాదు, తాను ఆయనను క్షమించబోనని తేల్చిచెప్పారు.