వీలునామా రాయని మారడోనా... పలు దేశాల్లో వారసులు!
- ఇటీవల కన్నుమూసిన సాకర్ మాంత్రికుడు
- మారడోనా ఆస్తి విలువ రూ.665 కోట్లు
- చట్టబద్ధంగా ఇద్దరు కుమార్తెలు
- ప్రేమాయణాల ఫలితంగా మరికొందరు సంతానం
అర్జెంటీనా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే చనిపోయే నాటికి మారడోనా ఆస్తి విలువ 90 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో రూ.665 కోట్లు. ఇప్పుడొచ్చిన సమస్య అంతా ఆయన ఆస్తి ఎవరెవరికి చెందాలన్నదే. చట్టబద్ధంగా చూస్తే మారడోనాకు ఇద్దరు కుమార్తెలు. చిన్ననాటి స్నేహితురాలు క్లాడియా విల్లాఫేన్ ను పెళ్లాడిన మారడోనాకు గియానినా, దాల్మా అనే కుమార్తెలు ఉన్నారు. ఇది మారడోనాలోని ఒక కోణం మాత్రమే.
మరో కోణం నుంచి చూస్తే ఆయన ప్రేమ వ్యవహారాలు చాలానే ఉన్నాయంటారు. ఇటలీకి చెందిన డీగో జూనియర్ అనే సాకర్ ప్లేయర్ కు తానే తండ్రినని మారడోనా గతంలో అంగీకరించడం ఈ కోవలోకే వస్తుంది. ఇక, 1996లో వాలేరియా సబలైన్ తో ప్రేమాయణం కారణంగా జన్మించిన జానా తన సంతానమేనని మారడోనా గుర్తించాడు. అంతెందుకు, 2013లోనూ ఆయన ఓ బిడ్డకు తండ్రయ్యారు. మాజీ గాళ్ ఫ్రెండ్ వెరోనికా ఓజెడాకు డీగో ఓజెడా అనే కుమారుడు కలగగా, ఇది కూడా మారడోనా ఖాతాలోకే చేరింది.
ఇక గతంలో మారడోనా మాదక ద్రవ్యాల రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని సంబంధాలు నెరిపాడని, ఆయన వారసుల మంటూ క్యూబా నుంచి కనీసం ముగ్గురైనా వచ్చే అవకాశం ఉందని మారడోనా లాయర్ అంటున్నాడు.
గతంలో ఓసారి ఇంటర్వ్యూ ఇస్తూ, తన కుటుంబ, కుటుంబేతర వ్యవహారాలతో విసిగిపోయిన మారడోనా తన ఆస్తినంతటినీ చారిటీ కోసం ఇచ్చేస్తానని వెల్లడించాడు. అయితే, అర్జెంటీనా చట్టాల ప్రకారం అది సాధ్యం కాదు. భార్య, బిడ్డల కోసం అత్యధిక భాగం కేటాయించాలని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, మారడోనా ఆస్తి ఎవరెవరికి చెందుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ, చూస్తుంటే సుదీర్ఘమైన న్యాయపోరాటాలు తప్పేట్టుగా లేవని అన్నారు.