కేసీఆర్ కు, నిజాంకు తేడా లేదు: యోగి ఆదిత్యనాథ్

  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ముమ్మర ప్రచారం
  • హైదరాబాదులో యోగి ఆదిత్యనాథ్ రోడ్ షోలు
  • కేసీఆర్ పథకం పారనివ్వకూడదన్న యోగి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నిజాం రూపంలో ఉన్న మరో నిజాం కేసీఆర్ అని అభివర్ణించారు. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ సర్కారు హైదరాబాద్ ప్రజలకు అన్యాయం చేస్తోందని అన్నారు.

వరద బాధితులకు ఆర్థికసాయం నేరుగా వారి ఖాతాల్లోకి ఎందుకు వేయలేదని యోగి ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు లబ్ది చేకూర్చేందుకే వరద సాయాన్ని నగదు రూపంలో అందించారని ఆరోపించారు. నయా నిజాం కేసీఆర్ పథకాన్ని పారనివ్వరాదని పిలుపునిచ్చారు. హైదరాబాదు ప్రజల ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


More Telugu News