ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

  • కొవిడ్ నేపథ్యంలో నడుస్తున్న ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్
  • డిసెంబరు 1 నుంచి రైళ్ల వేళల్లో మార్పులు
  • ప్రయాణికులు గమనించాలని సూచన
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నడిపిస్తున్న పండుగ ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే, రైళ్ల వేళల్లోనూ మార్పులు చేస్తున్నట్టు పేర్కొన్న రైల్వే.. పొడిగింపు ఎంతకాలమనే విషయాన్ని వెల్లడించలేదు. సేవలను పొడిగించిన రైళ్లలో  సికింద్రాబాద్-హౌరా-సికింద్రాబాద్ (02702/02705), విజయవాడ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-విజయవాడ (02711/02712), విజయవాడ-విశాఖపట్టణం-విజయవాడ (02718/02717), సికింద్రాబాద్-షాలిమర్-సికింద్రాబాద్ (02774/02773) రైళ్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు ఉంటాయని, ప్రయాణికులు గమనించాలని సూచించారు.

    


More Telugu News