బాలీవుడ్ నటి కంగనకు భారీ ఊరట.. బీఎంసీకి హైకోర్టు మొట్టికాయలు!

  • బీఎంసీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన బాంబే హైకోర్టు
  • దురుద్దేశంతో, పగతో ఇచ్చినట్టుగా ఉందని వ్యాఖ్య
  • కంగన రనౌత్‌కు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం
ముంబైలోని తన బంగళాలో ఉన్న కార్యాలయాన్ని బృహన్‌ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు కొంతమేరకు  కూల్చివేయడంపై హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటి కంగనకు ఊరట లభించింది. నటి పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌జే కథావాలా, జస్టిస్‌ రియా జ్‌ చాగ్లాలతో కూడిన బెంచ్ బీఎంసీ ఉత్తర్వులను తీవ్రంగా తప్పుబట్టింది.

బీఎంసీ ఇచ్చిన ఈ ఉత్తర్వు దురుద్దేశంతో, పగతో ఇచ్చినట్టుగా ఉందని చెబుతూ దానిని కొట్టివేసింది. బీఎంసీ ఇచ్చిన ఈ ఉత్తర్వులు చట్టపరమైన ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ నోటీసు వల్ల పిటిషనర్ బాధకు, అసౌకర్యానికి గురుయ్యారని కోర్టు పేర్కొంది. అంతేకాదు, ఇందుకు గాను ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని, అది ఎంత అనేది అంచనా వేసేందుకు ఓ సర్వేయర్‌ను కూడా నియమించిన కోర్టు వచ్చే ఏడాది మార్చి 21 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.


More Telugu News