హైదరాబాద్ సీసీఎంబీ రూపొందించిన కరోనా పరీక్ష విధానానికి ఐసీఎంఆర్ ఆమోదం
- డ్రై స్వాబ్ విధానానికి రూపకల్పన చేసిన సీసీఎంబీ
- లీకేజీ అవకాశాలు తక్కువంటున్న సీసీఎంబీ
- ఆర్ఎన్ఏ వెలికితీత అవసరంలేదంటున్న పరిశోధకులు
కరోనా వైరస్ ను గుర్తించేందుకు సురక్షితమైన విధానాన్ని రూపొందించినట్టు హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది. ఈ డ్రై స్వాబ్ పరీక్ష విధానానికి తాజాగా (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఆమోదం తెలిపింది. ఈ పరీక్ష విధానంలో ఆర్ఎన్ఏ వెలికితీతతో పనిలేకుండానే కరోనా వైరస్ ను గుర్తించవచ్చు.
సాధారణ పరీక్ష విధానాల్లో ముక్కు నుంచి, గొంతు నుంచి తీసిన తెమడ నమూనాలను ల్యాబ్ లకు పంపిస్తుంటారు. ఒక్కోసారి ఈ నమూనాలు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాబ్ లకు తరలించాల్సి ఉంటుంది. వీటిని వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియం అనే ద్రావణంలో ఉంచి రవాణా చేయడం, అధికంగా ప్యాక్ చేయడం వంటి చర్యలతో ఎంతో కాలహరణం జరుగుతుంది. పైగా ఈ నమూనాలు లీకయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే, సీసీఎంబీ పరిశోధకులు కనుగొన్న నూతన డ్రై స్వాబ్ విధానంలో ఇలాంటి సమస్యలు ఉండవట.
డ్రై స్వాబ్ ను నేరుగా ఆర్టీ పీసీఆర్ టెస్టు కోసం ఉపయోగించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. లీకేజీ అవకాశాలు తక్కువని, ఆర్ఎన్ఏ వెలికితీత సాధ్యం కాని పరిస్థితుల్లోనూ ఈ విధానంతో కరోనా వైరస్ ను గుర్తించవచ్చని వివరించారు.