నల్లా నీళ్లకు నిప్పు పెట్టిన అమ్మాయి.. వీడియో వైరల్!
- చైనాలో ఘటన
- నల్లాల ద్వారా వస్తోన్న నీటిలో ఆయిల్
- అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని వైనం
- నిప్పు పెట్టిన వీడియో వైరల్ కావడంతో వెంటనే వచ్చిన అధికారులు
నల్లాల ద్వారా వస్తోన్న నీటిలో పెట్రోలు వంటి ఆయిల్ కూడా వస్తుండడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ యువతి ఆ నీటికి లైటర్ తో నిప్పంటించింది. దీంతో నల్లా నుంచి నీరు వస్తోన్న కొద్దీ మంట గుప్పుమంటోంది. చైనాలోని పాంజిన్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్యాప్ వాటర్ ద్వారా వచ్చే నీటి ద్వారా మంటలు చెలరేగుతోన్న వింత ఘటనకు సంబంధించిన ఈ వీడియోను అక్కడి ఓ మీడియా సంస్థ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. వెన్ అనే యువతి ఈ ప్రయోగం చేస్తూ వీడియో తీసుకుందని చెప్పింది. తమ ఇంట్లో నల్లా నీళ్లు ఎప్పుడూ కొంచెం ఆయిల్ గా అనిపిస్తాయని, తమకు నీటిని సరఫరా చేసే పైపులో నేచురల్ గ్యాస్ కలుస్తోందని ఆమె తెలిపింది. ఈ కారణంతోనే తమకు అటువంటి నీళ్లు వస్తున్నాయని తాను భావించానని చెప్పింది.
ఈ విషయంపై తన తండ్రి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు చాలా కాలం నుంచి స్పందించట్లేదని తెలిపింది. ఇంట్లో ఇలాంటి నీళ్లు వస్తుండడంతో తన తల్లి ఆందోళన వ్యక్తం చేసిందని పేర్కొంది. ఆ యువతి ఈ వీడియో తీసుకుని పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయి అధికారుల దృష్టికి వెళ్లింది. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని అధికారులు ఈ ఘటన గురించి అందరికీ తెలిసిపోతోందన్న భయంతో వెంటనే వారి ఇంటికి వెళ్లారు.
సహజ వాయువు భూమిలో ఇంకిపోవడంతోనే ఇలా జరిగిందని వాళ్లు చెప్పారు. వీడియో పోస్ట్ అయిన రోజు మధ్యాహ్నంలోపే అధికారులు రంగంలోకి దిగి, సమస్య ఉన్న ప్రాంతంలో బావులను మూసేశారు. ఈ నీళ్లు వెళ్తున్న ఇళ్లకు నీటి సరఫరా నిలిపేశారు. తిరిగి మంచి నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.