తిరుపతి సమీపంలో వాయుగుండం.. అల్పపీడనంగా మారే అవకాశం
- తిరుపతికి ఉత్తరంగా 35 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
- కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు
- పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తిరుపతికి ఉత్తరంగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉన్న వాయుగుండం మరికొన్ని గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.