వారిద్దరిపై గౌరవం ఉంటే భారతరత్న ఇవ్వండి: అమిత్ షాను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి

  • తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటిన మహనీయుడు ఎన్టీఆర్
  • ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత పీవీది
  • ఈ ఇద్దరు మహానాయకులకు భారతరత్న ఇవ్వాలి
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వరకు చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి  కొనియాడారు. ప్రపంచంలోని తెలుగువారందరినీ ఏకం చేసిన ఘనత ఆయనదని అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ఈ దేశాన్ని అత్యున్నతమైన స్థితికి చేర్చిన ఘనత పీవీ నరసింహారావుదని చెప్పారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేలా తీర్చిదిద్దారని అన్నారు. ఈ ఇద్దరు మహనీయులకు భారతరత్న పురస్కారంతో గౌరవింపబడే అర్హత ఉందని చెప్పారు.

వీరిద్దరిపైన ఎంతో గౌరవం ఉందని బీజేపీ చెపుతోందని... నిజంగా మీకు వారిపై గౌరవమే ఉంటే... కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి భారతరత్న ఇవ్వాలని రేవంత్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను సందర్శించి, వారిద్దరికీ భారతరత్నను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశంలో చర్చ పెట్టి, ఈ ఇద్దరు మహానాయకులకు మేము భారతరత్న ఇస్తున్నామని ప్రకటించాలని కోరారు.


More Telugu News